జీవన గమనంలో మరువలేని జ్ఞాపకాల మజిలీ....అంతులేని సంతోషాల పందిరి.....HCU..................
Sunday, 11 March 2007
THE TERMINAL
ముక్కూ మొహం తెలియని మనుషులూ, అర్ధం కాని భాష, అసలు తన ఉనికే ప్రశ్నార్దకమైన చోట, తను దేనికి చెందడని తెలిసిన మీదట ఆందోళన చెందడం మన బోటి వారికి సంబందించిన విషయమైతే కావచ్చుకానీ నొవరోస్కీ కి మాత్రం కాదు. క్రకోజియా వాసి అయిన విక్టర్ నొవోరోస్కీ న్యూ యార్క్ విమానాశ్రయంలో ఒక unacceptable.అయితేనేం అతను అపరిచిత, అననుకూల పరిస్థితులను accept చేయగలడు.అది చాలు. అతడు లేని పడకని కుర్చీలతో సృష్టించుకోగలడు.ప్రేమరాహిత్యంతో బాధపడే యువతికి ఓదార్పునివ్వగలడు. నిపుణత కలిగిన ఈ సృజనశీలి తనకై తాను ఉద్యోగం సృష్టించుకోగలడు. అంతేనా... అంతకన్నా ఎక్కువే. అందుకనే హృదయం లేని నియమ నిభందనలని మే...మే....మేక అంటూ వెక్కిరించ గలిగాడు.కష్టంలో ఉన్నవాడు మనవాడే కావాలా సాయం చేయడానికి? ఒక చిన్న అబద్దం- తనను ఇబ్బందులపాలు చేసేదే అయినా ఒక నిండు ప్రాణాన్ని కాపాడు తుందన్న సంతృప్తి- అతగాడిని విమానాశ్రయ సిబ్బందితో accept చేయిచగలిగాయి. భారత దేశం నుండి వచ్చిన గుప్తా గారి వద్దకి వెళ్ళడానికి మనకు appointment లేకపోవచ్చు, నెపోలియన్ జోసాఫిన్ కి జన్మదిన కానుక ఏమి ఇచ్చాడో తెలియకపోవచ్చు కానీ న్యూ యార్క్ మహా నగరంలో తన తండ్రికి ఆరాధనీయుడైన సంగీతకారుని సంతకం నొవొరోస్కీ పొందగలిగాడని తెలుసుకోవడం మాత్రం ప్రేక్షకులకే కాదు, విమానాశ్రయ సిబ్బందికి కూడా ఆనందం కలిగించే విషయం. "ఎవరైనా తన ఇంటికి వెళ్ళడానికి ఎందుకు భయపడతారని" ప్రశ్నించే ఈ విశిష్ఠ వ్యక్తితో మీకూ కరచాలనం చేయాలనిపిస్తే స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన The Terminal చూడాల్సిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment