Friday, 27 July 2007

HCU convocation

హైదరాబాద్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఈ నెల (జూలై) 31న " హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్" లో నిర్వహిస్తున్నారు.

Saturday, 21 July 2007

Symposium on Communication for social development

Centre for Media Studies (CMS) వారు ఈ నవంబరు 1,2,3 తారీఖులలో “Communication for Social Development” పేరిట ఒక సింపోజియమును హైదరాబాదు విశ్వవిద్యాలయములో నిర్వహించనున్నారు. విద్య, ఆరొగ్యం,మానవ హక్కులు తద్ తర అంశాలపై వర్క్ షాపులు, ఎగ్జిబిష్న్స్,పేపర్ ప్రజెంటేషన్స్ మొదలైన అంశాలు ఉంటాయి. రిజిస్టేషన్ కు జూలై 30 , చివరితేది. పూర్తి వివరాలకు priya@cmsindia.org ఈ మెయిల్ చేసి కానీ,http://cmssymbols.cmsindia.org సైటును సందర్శించి తెలుసుకోవచ్చు.

Monday, 9 July 2007

వెలుగు రేఖల వెతుకులాట

మన వారసత్వం కోసం పాలకులు అనేక సందర్భలలో కిందామీదా పడటం మనకు కొత్తేమీ కాదు. ఇటీవలనే లండన్ మహా నగరంలో వేలానికి వచ్చిన మహాత్మా గాంధీ చివరి లేఖని దక్కించు కొవడం కొసం జరిగిన తతంగం మనము మర్చి పోలేదు. అయితే వారసత్వ సంపద అంటే కేవలం మనవద్ద నుండి ఇతరులు తరలించుకు పోయినవే కాదు మన కళ్ళముందే కాల గర్భంలో కలిసిపోతున్న మన చరిత్ర కూడ మన స్వీయ వారసత్వ సంపదే. ఈ విషయంపై విధాన నిర్ణేతలు దృష్టి సారించకపోవడం శోచనీయం.

మన రాష్ట్రంలోనే కృష్ణ,గోదావరి,తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాలలో విలసిల్లిన నాగరికతల అసుపాసులు అడపాదడపా లభ్యమవుతున్నప్పటికీ వీటిపై సమగ్ర అధ్యయనానికి ప్రజా ప్రభుత్వాలు దృష్టి సారించట్లేదు.
మొగస్తనీస్ తన "ఇండికా" గ్రంథంలోనూ, ప్రాచీన చైనా యాత్రీకుల రచనలలోను శ్రీ కాకుళం పరిసర ప్రాంతాలలోని మహాజనపదాల వర్ణన ఉంది. అదిలాబాదు, రంగారెడ్డి జిల్లాల పరిసర ప్రాంతాలలో పాత రాతి యుగపు అవశేషాలూ,రాక్షస బల్లుల శిలాజాలు లభించాయి. ఈ రోజు ఈనాడు దినపత్రికలో తుంగభద్రానదీ తీరాన కర్నూలు జిల్లాలోని జ్వాలా పురం గ్రామ సమీపాన వెలుగు చూసిన పురాతన మానవ నాగరికత అవశేషాల గురించి వివరించడం జరిగింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ నాగరికత సుమారు లక్ష సంవత్సరాలకు ముందటిదని ప్రస్తుతము అంచనా వేయబడుతున్నది.ఈ వార్త కథనం తాలుక లంకెని క్రింద ఇస్తున్నాను.

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel10.htm

ఈ విషయముపై మరింత లోతైన అధ్యయనము జరగాల్సిన అవసరముంది.ఇందులోని వాస్తవాలను వెలికి తీసి మన అతి పురాతన వారసత్వాన్ని ఈ భూమండలంపై రాబోవు తరాలకు అందించడము మన బాధ్యత. మనకు అందుబాటులో లేని ,విదేశాలలో చిక్కుబడిపోయిన సంపద గురించి పడుతున్న తాపత్రయంలో కొంతైనా ఇటువంటి పురాతత్వ సంపదను వెలికి తీయడములో పెడితే ఎక్కువ ప్రయోజనము ఉంటుంది.
విచారకరమైన విషయమేమిటంటే ఈ జ్వాలా పురం ప్రాచీన అవశేషాలు సైతం విదేశీ పరిశోధకుల పరిశోధనల ద్వారానే వెలుగులోకి రావడం. ప్రసిద్ద చరిత్ర పరిశోధకులు చొక్కాపు నారాయణ స్వామి గారి పరిశోధనలలో కూడా ఈ అంశాలు వెలుగు చూసినప్పటికీ మన వారికి వాటి గురించిన స్పృహ పరిమితం. ఎవరో తమ వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కొరకు జరిపే వింతల ఎంపికలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే మీడియా కూడా ఇటువంటి వార్తలకు ఇచ్చే ప్రాధాన్యం నామ మాత్రమే. ఇటువంటి అంశాలను ప్రజల దృష్టికి తెచ్చి వారిలో ఉద్యమస్పూర్తిని కలుగ జేయవలసిన గురుతర బాధ్యత ప్రచార సాధనాలపై ఉంది. ఇటువంటి అంశాలపై 30 నిముషాలు, స్పట్ లైటు వంటి కార్యక్రమాలు ప్రసారం చేయడం ద్వారా జాతిని మేల్కొలపడానికి మార్గం సులువవుతుంది. అంతే కాక చాలా కాలంగా "మిసిమి" పత్రికలోనూ,కొంత కాలం నుంచీ "నడుస్తున్న చరిత్ర"లోనూ తెలుగు వారి ప్రాచీన మూలాలపై పరిశొధనలుగావిస్తున్న కుమారి సంయుక్త కూనియ్య గారి వ్యాస పరంపరపైన దృష్ఠి సారించవలసిన ఆవశ్యకత ఉన్నది.
పౌర సమాజము, ప్రచార సాధనాలు, ప్రభుత కలసికట్టుగా పూనుకుంటే మన చరిత్రను సగర్వంగా పునర్నిర్మించడం, మన వారసత్వ సంపదను భావితరారకు అందించడము సులభ సాధ్యమవుతుంది. ప్రపంచ యువనికపై శరవేగంగా పురోగమిస్తున్న భారతావని ఈ మానవ చరిత్రకు మరొక విలువైన అధ్యాయాన్ని జతచేర్చగలుగుతుంది. అవును ఇది కేవలం భారతీయుల చరిత్ర మాత్రమే కాదు ఇది ప్రపంచ చరిత్ర.ప్రపంచ మానవులకు గర్వకారణమైన తొట్ట తొలి మానవ ప్రతినిధుల పోరాటగాధల,విజయనాదాల సమగ్ర వాస్తవాల జాజ్వలమానమైన వెలుగు రేఖ. ఈ వెలుగు రేఖల ఆవాహనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పూనుకొని మానవేతిహాసంలోని మహోజ్వల ఘట్టాలను సముజ్వలంగా అతి త్వరలోనే ఆవిష్కరిచగలరని ఆశిద్దాం!