Friday, 19 April 2013

ఇది మీ కవిత్వం

పదే పదే ఎదురయ్యే ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే ఉంటుంది.
అయినా కానీ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది.
" ఎందుకు ఇక్కడికి వస్తున్నాను అంటే యూనివర్శిటీ వాతావరణం , ఇక్కడి ఇంటలెక్చువల్ ఎన్విరాన్‌మెంట్ బయట ఉండదు కదా" అని నిన్న నాతో పాటూ షాప్‌కాం దాకా నడుస్తూ వచ్చిన ఒక పాత మిత్రుడు అన్నాడు. అతను ఇప్పుడు  నగరంలో ఒక పెద్ద కాలేజీలో జర్నలిజం శాఖకి HoD.
                                     అదీ చదవటమంటే. అక్షరాలని కాదు, అక్షరాల మధ్యన ఉన్న ఖాళీలని చదవటం. అక్షరాల మధ్యన చదవగలిగిన వారు కొందరుంటారు. వీళ్ళు క్లాసు రూముల బయట కూడా పాఠాలు వింటూ ఉంటారు. తరగతి గదుల బయట చదివిన చదువుని నేర్పటానికి, అక్షరాల మధ్యన ఉన్న ఖాళీలలో అర్ధాలు చూడటానికీ , మనం నిర్వచించుకున్న విద్యావిధానం సరిపోవట్లేదో  లేక ఆ స్థాయికి ఇంకా చేరుకొలేదో మరి. . ఏదేమైనా అలాంటి ఒకానొక సందర్భంలో ఆ లోటును తీర్చటానికి  కొన్ని భావాలు వ్యక్తుల రూపం తీసుకుని వస్తాయి. అలాంటి ఒక భావన ఢిల్లీ-జే.ఎన్.యూలో ఉంది. దాని పేరు "విద్రోహి".  తల్లిదండ్రులు రాం శంకర్ యాదవ్ అని పెట్టారు. కానీ విద్రోహిగానే సుపరిచితుడు.



                                     "మఠం భోజనం - సత్రం నిద్ర" లాంటి తెలుగు సామెత ఏదో ఉంది. పరిధులకావల జీవించగలిగే వారి గురించిన ఒక భావనని అందిస్తుంది అది. సామాజిక ప్రవాహగతులలో పడి కొట్టుకుని పోకుండా నిలిచి ఉండగలిగేవారు అతికొద్ది మంది చేయగలిగే పని అది. అందరూ చేయలేరు కానీ కొందరు చేయగలరు, అలాంటి వారిలో కొందరు ప్రవహగతిని అధిగమించటమే  కాక ప్రవాహ గమనాగమనాలను సరిదిద్దే పనిలో ఉంటారు.
                           విద్రోహి గత ముప్పై ఏళ్ళుగా JNUలో చెట్టుకిందా, పుట్టకిందా ఉంటూనే సమాజ ప్రవాహగతికి ఇంత నీడ కల్పిస్తున్నారు. ప్రశ్నించటం, తిరగబడటం అంగీకారయోగ్యంకాని చోట బహిష్కరణలు సహజమే. ఆయన రెండు సార్లు విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించబడి మరలా విద్యార్ధుల ప్రేమతో తిరిగి రప్పించబడ్డాడు. ఎనభైలలోనే విశ్వవిద్యాలయం నుంచి రెస్టికేట్ చేయబడిన విద్రోహి, ఇప్పుడు ఆ విద్యాలయానికి సూదంటురాయి లాంటి అనధికార ఆస్థాన కవి.   విశ్వవిద్యాలయంలో ఏ గంగా ధాభా దగ్గరో, లైబ్రరీ దగ్గరో కనిపించే విద్రోహి గురించిన షార్ట్ ఫిల్మ్ చూశాను ఇవ్వాళ. "మే తుమ్హారా కవీ హూం (I am Your Poet)" పేరిట నితిన్ కె పెమ్నాని నిర్మించిన ఈ లఘు చిత్రానికి ఈ ఏడాది  ముంబాయి అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు కూడా వచ్చింది.    


సాయంకాలపు భరతనాట్యాలు :)

యూనివర్సిటీలో ఉండే కొన్ని ప్రత్యేకమైన అవకాశాలలో ఒకటి నాటకాలూ, నృత్య ప్రదర్శనలూ చాలా ఠీవీగా ముందు వరుసలో కూర్చుని చూడగలగటం. ఆ సదుపాయంతో నిన్న సాయంత్రం డిఎస్‌టి ఆడిటోరియంలో కూర్చుని చాలా ప్రశాంతంగా SN School విద్యార్ధుల  భరత నాట్యం చూశాను. సీతారాములను పూజిస్తున్న ఈ భంగిమ అందులోనిదే.

                    సహజంగా ఎక్కడైనా టార్గెటెడ్ ఆడియన్స్ అంటూ ఉంటూనే ఉంటారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం లాగా. అయితే ఆడియన్స్‌ని బట్టి కార్యక్రమంలో వాతావరణం కూడా మారుతుంది. ఇలాంటి శాస్త్రీయ నృత్యాలు చూసే వాళ్ళు సాధారణంగా ఈలలు వేయటం, పెద్దగా అరవటం లాంటివి చెయ్యరు. అయితే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చే అలవాటు లేని మిత్రుడొకరు "DSTలో ఒక కార్యక్రమం ఇంత ప్రశాంతంగా చూడటం ఇదే మొదటిసారి" అని అన్నాడు. అతను విశ్వవిద్యాలయంలో గత 5 సంవత్సరాలుగా ఉంటున్నాడు. అయినా ఇలాంటి ప్రశాంతత అతనికి కొత్తగా అనిపించింది.
              సో........ ఎన్ని రోజులు గడిచినా HCUలో కొత్తవి ఏదో ఒకటి కనబడుతూనే ఉంటాయనుకుంటా. :)   

Tuesday, 25 September 2012

మూడు పంచదార బిళ్ళలు

చాలా రోజుల తరువాత మంచి కిక్ ఇచ్చిన కథ "మూడు పంచదార బిళ్ళలు". అమోరీ హేర్ రాసిన ఈ కథకు తెలుగు అనువాదం డా. వై. నిర్మల గారు. సహస్రాబ్ద సంధికాలంలో నా మిత్రులంతా కొత్తగా విడుదలైన సినిమాల కోసం ధియేటర్ల వేంట పరుగులుపెట్టే రోజుల్లో నేను ఒక్కడినే తెనాలి ఫుట్‌పాతుల వేంబడి తిరుగుతూ అట్టలూడిపోయిన పాత విపులలు కొని చడివేవాడిని. చేదుగ ఉండే మద్యంలో ఉండే కిక్కేదో నాకు ఇంతవరకూ వంటబట్టలేదు కానీ ఈ కథలలో ఉండే భావోద్వీగాల మెరుపులు నాకు భలే కిక్కు ఇచ్చేవి. నేను ఒక దశలో వాటికి బానిసనయ్యాను, అ రోజుల్లో టాల్‌స్టాయ్, దొస్త్‌యేవ్‌స్కీలతో పాటుగా అంతకు ముందెణ్ణడూ పేరు కూడా తెలీని ఈ "విపుల" రచయితలు నాకు వారాంతపు స్నేహితులు. నిన్న ఈ కథ చదివాక మళ్ళీ ఆ అనుభూతి కలిగింది. పాత ఎడిటర్ చలసాని ప్రసాదరావు గారు అనుకుంటా, ఆయన తరువాత విపుల స్థాయి తగ్గిపోయింది అనిపించింది నాకు దాంతో చదవటం మానేశాను. మళ్ళీ ఇవ్వాళా అప్పటి జ్ణాపకాలు మెరిశాయి. ఒకప్పుడు విపుల ట్యాగ్ లైన్ "విశ్వకథా విపంచి" అని............మళ్ళీ ఆ ధోరణిలోకి వస్తే బాగుండునని ఒక చిన్న ఆశ.      పూర్తి కథ  ఇక్కడ .మూడు పంచదార బిళ్ళలు - అమోరీ హేర్ (అను. డా. వై నిర్మల) 

Wednesday, 28 December 2011

నాకు నేను దొరికాను


మీరెప్పుడైనా టైం మెషీన్‌లో ప్రయాణించారా ? కొద్ది రోజుల క్రితం ఓ మిట్ట మధ్యానం లింగంపల్లిలో MMTS ఎక్కి నేను హైదరాబాదు బుక్ ఫెయిర్‌కి వెళ్ళాను. మంచిపుస్తకం స్టాల్లోకి వెళ్ళాక నాకు నిజంగానే ఒక టైం మెషీన్ ఎక్కిన అనుభూతి కలిగింది. పరాయీకరించబడిన జీవితంలో, మార్కులు, ర్యాంకులు, పెర్ఫర్మన్సుల ప్రవాహగతిలో పడికొట్టుకుపోతున్న నాకు మళ్ళీ నేను దొరికిన అనుభూతి కలిగింది. చిన్నప్పుడు చదివిన పుస్తకాలు ఇప్పుడు మళ్ళీ కొత్త రంగుల్లో కనిపించాయి. చాలా మళ్ళీ పునర్ముద్ర్ణకు నోచుకున్నవే. వాటి ముఖచిత్రాలు మాత్రమే కాదు పబ్లిషర్లూ మారారు. కొన్ని పుస్తకాలకైతే అనువాదకులూ మారారు. అలాంటి వాటిలో ఒకటి ఆంటోనీ-డీ-సెయింట్ ఎక్స్పరీ రాసిన "చిన్నారి నేస్తం", అదిప్పుడు చిట్టి రాజు అనే పేరుతో పునర్ముద్రితమైంది. ఆశగా బుక్ తీసి కొంత చదివాను....అప్పుడు కానీ అర్ధ్మౌవలేదు...అది ఆత్మ లోపించిన అనువాదమని...ఇంకా సరిగ్గా చెప్పాలంటే అంకెలు మాత్రమే అర్ధంచేసుకోగలిగిన పెద్దవాళ్ళ కోణం నుంచి అనువదించబడిన పుస్తకమది. లియోన్‌వెర్త్‌కి అతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇచ్చిన అంకితం ఆ పుస్తకంలో లేదు....అంతే కాదు పుస్తకం ఆకారం, శైలికూడా కేవలం అంకెలు మాత్రమే అర్ధంచెసుకోగలిగిన పెద్దలకు మాత్రమే ఉద్దేశించినట్లుగా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం ఆ సాయంత్రం ఆ బుక్ ఫెయిర్‌లో తప్పిపోయిన నాకు నేను దొరికాను. ఎన్నాళ్ళ నుంచో నేను వెతుకుతున్న నేను దొరికేసరికి నాకు పట్టలేని ఆనందం కలిగింది. ఆ సాయంత్రం పుస్తకాల దుకాణాలు మూసేసే వరకూ అక్కడే ఉండి ఓ 300ల రూపాయల వరకూ జ్ణాపకాలనీ, మరికొన్ని కొత్త అనుభవాలనీ పొట్లాం కట్టుకుని నెక్లెస్ రోడ్డు స్టేషన్లో మళ్ళీ ట్రైన్ ఎక్కాను. :)

Thursday, 28 July 2011

Wednesday, 29 December 2010

శీతాకాలంలో ఒక శీతవేళ

 

                     k4108125

......................................................

..........................................................

....................................................

...................................................

"మౌనం మాటాడింది మరి." :)

Saturday, 2 October 2010

Postcards from Leningrad

 

postales.jpg

ఈ వెనెజూలా సినిమా నాకు ఒకపట్టన తలకెక్కలేదు. ప్రతిసారీ ఏదో ఉంది అనిపిస్తూ అంతలోనే ఏమీలేనట్లు సాగిన కథనం ఈ సినిమాకి ప్లస్సో మైనస్సో తెలీలా. 1960లలో అక్కడి కమ్మ్యూనిస్ట్ గొరిల్లాల జీవన నేపథ్యంగా సాగిన కథని భిన్న కోణాల నుంచి చూపే ప్రయత్నం చేశారు. అయితే ఈ కథనం విభిన్న కాలరేఖలపై సాగడం నాకు గజిబిజిని మిగిల్చింది. కానీ కొన్ని వ్యక్తీకరణలు బాగున్నాయి. వెపన్స్ దాచుకున్న వారిని ప్రత్యేకమైన కార్టూన్లతో చూపడం, బుల్లెట్ గాయం అయిన వ్యక్తిని ఎర్ర పువ్వులతో చూపడం మంచి వ్యక్తీకరణలు.

తమకు పేరు లేదంటూ చెప్పే చిన్నారుల ద్వారా పోరాట జీవితాలలోని ఒక అంశాన్ని బలంగా స్పృశించారు. అజ్ణాట యోధుల సంగతేమో కానీ ప్రతి రోజుయ ఒక నూతన వేషంతో, ఒక కొత్త ముఖాన్ని తగిలించుకునే మనకు కూడా పేరు లేకపోవటం సౌకర్యంగా ఉంటుందేమో అనిపింకింది. మరీ చెత్త సినిమా అని కాదు కానీ ....పర్లేదు ఒక సారి చూడొచ్చు.

Monday, 9 August 2010

ఇక ఈ రాత్రికి నిద్రే లేదు.

                                                                                gaia

నీ గురించి ఆలోచిస్తుంటే ఇక ఈ రాత్రికి నిద్రే లేదు. వసంతాగమనమే కాదు కొత్త ఉషస్సులు కూడా నన్ను నిద్ర పోనివ్వటం లేదు. నడి రాతిరి ఉషస్సుల మెరుపులు ఏ  హృదయ గానాల అవ్యక్త భావనలో ఇప్పుడిక తెలిసే అవకాశం మరి లేదు. తొడిమను విడిచిన ఆ లేతాకు ఇప్పుడు సమీరంతో చెలిమి చేసింది. నూతన మజిలీలు ఇప్పుడిక తరగని గమ్యాలుగా మారాయి. ఒక సంఢ్యా ప్రారంభకాలాన గమ్యమో మజిలీనో తెలియని ఒక చైతన్యపూరిత ప్రశాంత జాగ్రదావస్తలో ఆ నునులేత చిగురు చడీచప్పుడు చెయకుండా నేలను తాకుతుందేమో. వేచి చూడాలి మరి. సమీరంతో చెలిమి కొనసాగేనా ?

Saturday, 19 June 2010

Test post

Hello testing windows live writer

Map picture

2523861868_9d5d6193ce_b

Saturday, 7 March 2009

ఉప ఎన్నికలు 2008-2009

అందరూ ఊహించినదే జరిగింది. నెల్సన్ మండేల 207 వోట్ల మెజారిటీతో విశ్వవిద్యాలయ విద్యార్ది సంఘం అద్యక్షునిగా విజయం సాధించాడు. మారిన సమీకరణాల నేపద్యంలో మున్ముదు విద్యార్ది సంఘం కార్యకలాపాలు ఆసక్తికరంగా మారగా, ప్రజాస్వామ్య విలువలకు పట్టంకడుతూ విద్యార్ధులు వెలువరిచిన తీర్పు భాద్యతాయుతమైన నాయకత్వాల ఆవశ్యకతని తెలియజేసింది.
ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘం పోషించిన పాత్ర ప్రశంసార్హమైనది. మండేల ఎన్నిక ఇప్పుడున్న ట్రెండు ప్రకారం మార్పునకు సంకేతమేమో....చూడాలి మరి.