యూనివర్సిటీలో ఉండే కొన్ని ప్రత్యేకమైన అవకాశాలలో ఒకటి నాటకాలూ, నృత్య ప్రదర్శనలూ చాలా ఠీవీగా ముందు వరుసలో కూర్చుని చూడగలగటం. ఆ సదుపాయంతో నిన్న సాయంత్రం డిఎస్‌టి ఆడిటోరియంలో కూర్చుని చాలా ప్రశాంతంగా SN School విద్యార్ధుల భరత నాట్యం చూశాను. సీతారాములను పూజిస్తున్న ఈ భంగిమ అందులోనిదే.
సహజంగా ఎక్కడైనా టార్గెటెడ్ ఆడియన్స్ అంటూ ఉంటూనే ఉంటారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం లాగా. అయితే ఆడియన్స్‌ని బట్టి కార్యక్రమంలో వాతావరణం కూడా మారుతుంది. ఇలాంటి శాస్త్రీయ నృత్యాలు చూసే వాళ్ళు సాధారణంగా ఈలలు వేయటం, పెద్దగా అరవటం లాంటివి చెయ్యరు. అయితే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చే అలవాటు లేని మిత్రుడొకరు "DSTలో ఒక కార్యక్రమం ఇంత ప్రశాంతంగా చూడటం ఇదే మొదటిసారి" అని అన్నాడు. అతను విశ్వవిద్యాలయంలో గత 5 సంవత్సరాలుగా ఉంటున్నాడు. అయినా ఇలాంటి ప్రశాంతత అతనికి కొత్తగా అనిపించింది.
సో........ ఎన్ని రోజులు గడిచినా HCUలో కొత్తవి ఏదో ఒకటి కనబడుతూనే ఉంటాయనుకుంటా. :)

No comments:
Post a Comment