శనివారం సాయంత్రం హైదరాబాదు నగర నడి బొడ్డున చోటుచేసుకున్న దారుణాన్ని విశ్వవిద్యాలయంలోని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భముగా ఈరోజు సాయంత్రం 7 గం. లకు "Peace Walk" నిర్వహించడం జరిగింది. DST ఆడిటోరియం నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన birth day circle మీదుగా Shop com వరకు జరిగింది. ఈ సందర్భముగా ప్రసంగించిన వక్తలు ఈ దాడి ఏ ఒక్క మతస్తులపైనో జరిగిన దాడి కాదని యావత్ భారతీయులపై జరిగిన దాడి అనీ పేర్కొన్నారు. నిన్న మసీదులో, నేడు విహార స్థలాల వద్ద జరిపిన ఈ దాడులు గర్హనీయమైనవని పేర్కొన్నారు. భావజాలాలకు అతీతముగా భారతీయులందరూ ఇటువంటి విచ్చిన్నకర శక్తుల చర్యలను ఖండించాల్సిందిగా విజ్ణప్తి చేశారు.
కొవ్వొత్తులు వెలుగులో సాగిన ఈ మౌన ప్రదర్శనలో university విద్యార్ధులు విశేషంగా పాల్గొని దుర్ఘటన భాదితులకు తమ సానుభూతి, సంఘీభావం తెలిపారు. Shop Com వద్ద వెలుగుతున్న కొవ్వొత్తులు కన్నీటి బిందువు ఆకారంలో వెలుగులు విరజిమ్ముతూ అక్కడ సమావేశమైన వారి బరువెక్కిన హృదయాల భావాలను చెప్పకనే చెప్పాయి. వెలుగుతున్న ఆ దీపాలు మానవత్వం పట్ల ఈ నగర వాసులకు ఉన్నా గట్టి నమ్మకానికీ, విచ్చిన్నకర శక్తుల పన్నాగాలకు తల ఒగ్గని మనో స్థైర్యానికీ ప్రతీకలుగా ప్రకాశించాయి.
ఈ కార్యక్రమ నిర్వహణలో intigrated course విద్యార్ధులు చూపిన చొరవ ప్రత్యేకముగా పేర్కొనదగినది. దుర్ఘటన వివరాలు అందిన వెంటనే వారు స్పందించి ఆదివారం ఉదయమే బాధితులకు అవసరమైన ఆహార పదార్ధాలూ, cell phone recharge coupanలు తీసుకుని Medicity Hospitalలోని బాధితులకు అందజేశారు. వారి చొరవ ప్రశంసనీయం. కనీసం ఆహార పదార్ధాలను కూడా స్వీకరించలేని స్థితిలో ఉన్న బాధితుల గురించి వారు చెప్పిన సంగతులు ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని కదిలించివేశాయి. ఇటువంటి దుర్ఘటనలు మరలా జరగకుండా తీసుకోవలసిన చర్యల గురించి చర్చిస్తూ బాధాతప్త హృదయాలతో మేమక్కడ నుండి తిరిగి వచ్చాము.
జీవన గమనంలో మరువలేని జ్ఞాపకాల మజిలీ....అంతులేని సంతోషాల పందిరి.....HCU..................
Monday, 27 August 2007
Saturday, 18 August 2007


కొత్త నీటి రాకతో బఫెల్లో లేక్ కళకళలాడుతోంది. మా క్లాస్ రూములనుండి చూస్తుంటే ఒక్క ఆదివారమైన లేక్ ఒడ్డుకు వెళ్ళి కొంత సేపు గడిపిరావాలనిపిస్తూంది. లేక్ మీదనుంచి వీస్తున్న చల్లని గాలులు రారమ్మని పిలుస్తూంటే ఎంత తొందరగా వెళ్ళి ఆ నీటి గలగలలని ఆనందించివద్దామాని మనసు తొందరపెడుతోంది. ప్రతి ఋతువులోనూ ప్రకృతి సంతరించుకునే నూతన అందాలను అతిదగ్గర నుండి ఆస్వాదించగలగడం ఈ కాలుష్యకాలంలో దేవుడివ్వగలిగిన గొప్ప వరాలలో ఒకటి.
యూనివర్సిటీలో ఉన్న లేక్‌లలో బఫెల్లో లేక్ పెద్దది. ఇది అశ్రయమిస్తూన్న జీవజాల పరిమాణం కూడ పెద్దదే. రాధాకృష్ణన్ లెక్చర్ హాల్ నుండి చూస్తునప్పుడు లేత నీలి రంగులో మెరిసిపోయే ఈ సరస్సులోని నీటి ఉపరితలం అకాశాన్ని నేల మీదపరిచిన అనుభూతిని కలిగిస్తుంది.
యూనివర్సిటీలో ఉన్న లేక్‌లలో బఫెల్లో లేక్ పెద్దది. ఇది అశ్రయమిస్తూన్న జీవజాల పరిమాణం కూడ పెద్దదే. రాధాకృష్ణన్ లెక్చర్ హాల్ నుండి చూస్తునప్పుడు లేత నీలి రంగులో మెరిసిపోయే ఈ సరస్సులోని నీటి ఉపరితలం అకాశాన్ని నేల మీదపరిచిన అనుభూతిని కలిగిస్తుంది.
కూల్చేయకండి...యకండి...కండి....

ఇది కనుమరుగవుతున్న ఒక మట్టి సంస్కృతి చివరి గొంతుక. మూగబోతున్న ఆత్మీయ స్పర్శల చివరి వేదుకోలు. ఆకాశాన్ని కొనలేని వారికి భూమ్మీద రెండు టీ చుక్కలు తాగే అవకాశాన్నిచ్చిన Gops ఇప్పుడు లేదు. నిన్న ఉదయం అటు వెళ్ళినప్పుడు చెదరగొట్టబడిన జ్ఞాపకాల ఆనవాళ్ళుగా నిలిచిన కొన్ని పాత గోనె సంచులక్కడ దర్శనమిచ్చాయి.
ఈ విశ్వవిద్యాలయంలో Gops కేవలం ఒక కాంటీన్ మాత్రమే కాదు, యువత అభిప్రాయలను పంచుకునే వేదిక, పలకరింపులను మొదలుకొని తమ విజయాలను,వైఫల్యాలను పరస్పరం పంచుకునే ఆత్మీయ హృదయ స్పర్శ. ఈ విశ్వవిద్యాలయ విద్యార్దుల జీవితంలో ఒక విడదీయరాని భాగం.
ఇప్పుడు దేశవిదేశాలలో ఉన్న పూర్వ విద్యార్ధులు మమ్మల్ని అప్పుడప్పుడూ అడుగుతూ ఉంటారు "యూనివర్శిటీ ఎలా ఉంది?" అని. మేము ఇక్కడి ఎకడమిక్స్, ఈవెంట్స్ గురించి చెప్పి వదిలేస్తే వెంటనే మాకు ఎదురయ్యే ప్రశ్న "GOPS సంగతులేమిటని?" అవును GOPS ఈ యూనివర్శిటీలో ఒక భాగం.GOPS గురించి చెప్పక పోతే యూనివర్శిటీ గురించి పూర్తిగా చెప్పనట్లే. కానీ ఇప్పుడు GOPS లేదు. GOPS లేని హెచ్.సి.యు మాత్రమే ఇప్పుడు ఉంది. ఇక స్నేహబృందం కోసం ఎదురు చూపులు,హుషారైన పలకరైంపులు,తియ్యనైన వీడ్కోళ్ళు, ఆనందాలు,విషాదాలు,ఓదార్పులు, మేథోచర్చలు అన్ని నిన్నటి మాట.
మానవీయ అనుభూతుల్ని ఇప్పుడు ఏ ఫుడ్ కోర్టులలొ కొనుక్కోవాలన్నది మాముందున్న ప్రశ్న. పచ్చని చెట్ల కింద, చల్లని సాయంసంధ్యలు మిగిల్చిన జ్ఞాపకాలను ఎక్కడ వెతుక్కోవాలన్నది మాకు మాత్రమే మిగిలిన సమస్య. మా మనస్సులలో ఉన్నది ఒకటే సందేహం, విశాలమైన యూనివర్శిటీలో "మనస్సు" కు కాసింత చోటు కరువైందా???? రూల్స్ ఒప్పుకోమన్నాయా అని? రాజు పలకరింపులతో, సంగయ్య చిరునవ్వులతో,మా సంతోషాలకు, ఆనందాలకు నెలవైన GOPS తిరిగి ప్రారంభించాలన్నది మా అందరి అభ్యర్ధన. అందుకనే "ఆకాశాన్ని కొనలేని వారు భూమ్మీద రెండు టీ చుక్కలు కోసం ఎదురుచూస్తున్నారు" ....మట్టి స్పర్శ కోసం...మానవీయ స్పర్శ కోసం...ఎదురు చూస్తున్నారు.
Saturday, 11 August 2007
వినువీధిలో వెన్నెల వెలుగులు

మన జీవిత కాలంలో కొన్ని ఘట్టాల ద్వారా ప్రయాణించడం ఒక్కో సారి గొప్ప అనుభూతులకు ఆస్కారమిస్తూంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఆనాటి విశేషాలు తోటివారితో చెప్పుకొంటున్నప్పుడు కించిత్ గర్వమతిశయించడం కద్దు. అటువంటి ఒక ఖగోళ అద్బుతానికి వినువీధులు రేపు ఉదయం వేదిక కాబోతున్నాయి. చిక్కటి చీకటిని చీల్చుకుంటూ,వెలుగులని విరజిమ్ముకుంటు సెకనుకు 60 కి.మీ. వేగంతో దూసుకువచ్చే p-109 స్విఫ్ట్ టటిల్ తోక చుక్క శకలాలు ఈ సుందర దృశ్యాన్ని ఆవిష్కరించ బోతున్నాయని M.P. బిర్లా సైన్స్ ప్లానిటోరియం డైరెక్టర్ దేవీ ప్రసద్ దువారి తెలియజెస్తున్నారు. 130 యేళ్ళ కోసారి వచ్చే ఈ దృశ్యాన్ని మామూలు కళ్ళతో చూడవచ్చనికూడా తెలియజేశారు. కాబట్టి రేపటి రోజున ఈ యాంత్రిక జీవితాన్ని ఓ పది నిముషాలు ప్రక్కన పెడితే (మేఘాలు అనుమతిస్తేనే సుమా!) ఆ ఖగోళ వింతని చూసి ఆనందించవచ్చు.
Subscribe to:
Posts (Atom)