Saturday, 18 August 2007



కొత్త నీటి రాకతో బఫెల్లో లేక్ కళకళలాడుతోంది. మా క్లాస్ రూములనుండి చూస్తుంటే ఒక్క ఆదివారమైన లేక్ ఒడ్డుకు వెళ్ళి కొంత సేపు గడిపిరావాలనిపిస్తూంది. లేక్ మీదనుంచి వీస్తున్న చల్లని గాలులు రారమ్మని పిలుస్తూంటే ఎంత తొందరగా వెళ్ళి ఆ నీటి గలగలలని ఆనందించివద్దామాని మనసు తొందరపెడుతోంది. ప్రతి ఋతువులోనూ ప్రకృతి సంతరించుకునే నూతన అందాలను అతిదగ్గర నుండి ఆస్వాదించగలగడం ఈ కాలుష్యకాలంలో దేవుడివ్వగలిగిన గొప్ప వరాలలో ఒకటి.
యూనివర్సిటీలో ఉన్న లేక్‌లలో బఫెల్లో లేక్ పెద్దది. ఇది అశ్రయమిస్తూన్న జీవజాల పరిమాణం కూడ పెద్దదే. రాధాకృష్ణన్ లెక్చర్ హాల్ నుండి చూస్తునప్పుడు లేత నీలి రంగులో మెరిసిపోయే ఈ సరస్సులోని నీటి ఉపరితలం అకాశాన్ని నేల మీదపరిచిన అనుభూతిని కలిగిస్తుంది.

1 comment:

Anonymous said...

బాగుంది తమ్మిడూ.ఇలాగే నీలోని మనిషిని కలకాలం బతికించుకో