జీవన గమనంలో మరువలేని జ్ఞాపకాల మజిలీ....అంతులేని సంతోషాల పందిరి.....HCU..................
Tuesday, 27 February 2007
national science day జాతీయ సైన్స్ దినోత్సవం
జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలలో భాగంగా 28,Febన D.S.T అడిటోరియంలో సుబ్రతో సిన్హా, AIIMS,New Delhi వారి ఉపన్యాసము ఉన్నది.ఈ కార్యక్రమమును Dept of Biotech, School of Life Sciences వారు నిర్వహిస్తున్నారు.
International Urdu Seminaar
ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం అజాద్ అంతర్జాతీయ ఉర్దూ సెమినార్ డి.యస్.టి ఆడిటోరియంలో జరుగుతున్నది. ఇది 28వ తారీఖున ముగియనున్నది
Monday, 26 February 2007
హెల్త్ కార్డులు (health cards)
మన యూనివర్సిటి విద్యార్ధులకు,
యూనివర్సిటీ హెల్త్ కార్డులు మీరు తీసుకున్నారా? లేకుంటే ఈ కార్డులను చీఫ్ వార్డెన్ వారి భవనమునందు పొందవచ్చు.
యూనివర్సిటీ హెల్త్ కార్డులు మీరు తీసుకున్నారా? లేకుంటే ఈ కార్డులను చీఫ్ వార్డెన్ వారి భవనమునందు పొందవచ్చు.
J.N.U APPLICATIONS
J.N.U Application ఫాంలు HCU ద్వారా అందించబడుతున్నాయి.ఈ Applications కావలసిన వారు administration building వద్ద వీటిని పొందవచ్చు.
మొదటి స్థానంలో HCU (HCU in first place)
ఈ ఆదివారం జీవశాస్త్రాల విద్యార్ధినీవిద్యార్దులకు తీపి కబురును అందించింది.ది హిందు,Times of india పత్రికలు బయో టెక్నాలజి కోర్సును బోదించే సంస్థలలో HCU మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని ప్రచురించాయి. బయో స్పెక్ట్రం వారు ఇదివరకే వెలువరచిన ఈ ర్యాంకింగులలో ఉపాధి కల్పన అంశంలో వెనుకబడి ఉన్న HCU అతి త్వరలోనే ఈ పరామితి(parameter)లో కూడా అగ్రతాంబూలం అందుకోగలదని ఆశిద్దాం.
సిటీ ఆఫ్ గాడ్ (CITY OF GOD)
గత శనివారం డి.యస్.టి ఆడిటోరియంలో ప్రదర్శించిన "సిటి ఆఫ్ గాడ్" చిత్రం నిజంగా మనసును కదిలించివేసే సినిమా. ఇందులొ ఒక ఫొటొగ్రాఫర్ తన ఆత్మకథ వివరిస్తూంటాడు. అతని స్వస్థలములోని పేదరికం, పేరుకుపోయిన నైచ్యం ఏ విధంగా హంతకముఠాలు రూపు దాల్చటానికి దారి తీసిందో వివరిస్తాడు. ఒక ఫొటోజర్నలిస్ట్ గా ఎదిగే క్రమంలో తాను పొందిన అనుభవాలను ప్రేక్షకుడి మదిని కల్లోలపరచగలిగే స్థాయిలొ చూపిస్తాడు.ముఖ్యంగా దొంగతనం చేశారనే నెపంతో,అప్పటికే భయంతొ బిక్కచచ్చి ఏడుస్తున్న ఇద్దరు పిల్లలలో ఒకరిని చంపవలసిందిగా ముఠానాయకుడు ఆదేశించే దృశ్యం గుండెలను పిండేస్తుంది. ఇది ఆ హంతక ముఠాల క్రౌర్యానికి పరాకాష్ట. థియేటర్ వదిలి వచ్చిన తరువాత కూడ వెంటాడే సినిమా ఇది.ఈ చిత్రాన్ని HCU FILM CLUB వారు ప్రదర్శించారు.
Nation,Region and Ideology in Films
Nation,region and ideology in films అను కార్యక్రమము మార్చి 28 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖాధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
ఇందులో భాగంగా
27/2న గాల్గి,
28/2న కహా కహా మే గుజార్ గయే,
1/3న గరం హవా,
2/3న ఇస్లాం ఇన్ ఇండియా చిత్రాలు హ్యుమానిటీస్ ఆడిటోరియంలో ప్రదర్శించబడతాయి.
Subscribe to:
Posts (Atom)