
ఇది కనుమరుగవుతున్న ఒక మట్టి సంస్కృతి చివరి గొంతుక. మూగబోతున్న ఆత్మీయ స్పర్శల చివరి వేదుకోలు. ఆకాశాన్ని కొనలేని వారికి భూమ్మీద రెండు టీ చుక్కలు తాగే అవకాశాన్నిచ్చిన Gops ఇప్పుడు లేదు. నిన్న ఉదయం అటు వెళ్ళినప్పుడు చెదరగొట్టబడిన జ్ఞాపకాల ఆనవాళ్ళుగా నిలిచిన కొన్ని పాత గోనె సంచులక్కడ దర్శనమిచ్చాయి.
ఈ విశ్వవిద్యాలయంలో Gops కేవలం ఒక కాంటీన్ మాత్రమే కాదు, యువత అభిప్రాయలను పంచుకునే వేదిక, పలకరింపులను మొదలుకొని తమ విజయాలను,వైఫల్యాలను పరస్పరం పంచుకునే ఆత్మీయ హృదయ స్పర్శ. ఈ విశ్వవిద్యాలయ విద్యార్దుల జీవితంలో ఒక విడదీయరాని భాగం.
ఇప్పుడు దేశవిదేశాలలో ఉన్న పూర్వ విద్యార్ధులు మమ్మల్ని అప్పుడప్పుడూ అడుగుతూ ఉంటారు "యూనివర్శిటీ ఎలా ఉంది?" అని. మేము ఇక్కడి ఎకడమిక్స్, ఈవెంట్స్ గురించి చెప్పి వదిలేస్తే వెంటనే మాకు ఎదురయ్యే ప్రశ్న "GOPS సంగతులేమిటని?" అవును GOPS ఈ యూనివర్శిటీలో ఒక భాగం.GOPS గురించి చెప్పక పోతే యూనివర్శిటీ గురించి పూర్తిగా చెప్పనట్లే. కానీ ఇప్పుడు GOPS లేదు. GOPS లేని హెచ్.సి.యు మాత్రమే ఇప్పుడు ఉంది. ఇక స్నేహబృందం కోసం ఎదురు చూపులు,హుషారైన పలకరైంపులు,తియ్యనైన వీడ్కోళ్ళు, ఆనందాలు,విషాదాలు,ఓదార్పులు, మేథోచర్చలు అన్ని నిన్నటి మాట.
మానవీయ అనుభూతుల్ని ఇప్పుడు ఏ ఫుడ్ కోర్టులలొ కొనుక్కోవాలన్నది మాముందున్న ప్రశ్న. పచ్చని చెట్ల కింద, చల్లని సాయంసంధ్యలు మిగిల్చిన జ్ఞాపకాలను ఎక్కడ వెతుక్కోవాలన్నది మాకు మాత్రమే మిగిలిన సమస్య. మా మనస్సులలో ఉన్నది ఒకటే సందేహం, విశాలమైన యూనివర్శిటీలో "మనస్సు" కు కాసింత చోటు కరువైందా???? రూల్స్ ఒప్పుకోమన్నాయా అని? రాజు పలకరింపులతో, సంగయ్య చిరునవ్వులతో,మా సంతోషాలకు, ఆనందాలకు నెలవైన GOPS తిరిగి ప్రారంభించాలన్నది మా అందరి అభ్యర్ధన. అందుకనే "ఆకాశాన్ని కొనలేని వారు భూమ్మీద రెండు టీ చుక్కలు కోసం ఎదురుచూస్తున్నారు" ....మట్టి స్పర్శ కోసం...మానవీయ స్పర్శ కోసం...ఎదురు చూస్తున్నారు.
5 comments:
Sincerely all wish that GOPS to be back - madhav 90-93 batch
గోప్స్ లేదా?? అయ్యో! కనీసం చెట్టును, కూర్చునే దిమ్మెలనైనా మిగిల్చారా?
చాలా బాధగా ఉంది. నా జీవితంలో రెండేళ్ళు ఆ చెట్టు కిందే గడిపా..ఆఖరికి మా బ్యాచీ వాళ్లు వాడికేం తెలుసు చెట్టు కింద కూచుని చాయ్ తాగటం తప్ప అనేదాకా
అయ్యో
అయ్యో
అయ్యో
వల వల వల
వల వల వల
ఇంతకీ ఎందుకు?
అక్కడ టీ నీళ్ళ టీ అయినా ఆ యాంబియన్సుకు నీళ్ళీచ్చినా బాగుంటాయి.
బాఆఆఆఆఆఆఆఆ
Madhav gaaru thankq for ur wishes. Ravi gaarikii అలాగే ఒరె మునా గారి సహానుభూతికికూడా కృతజ్ణతలండీ. మీ అందరి ఆకాంక్షల ఫలితమేనేమో మళ్ళీ GOPS తిరిగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
అసలేమి జరిగిందంటే...ఇంతకు ముందు ఉన్న చోటు నుండి GOPSను రెండు నెలల క్రితమే ఓపెన్ ఆడిటోరియం వెనుకకి మార్చారు. ప్రస్తుతం అక్కడ నుండి కూడా తొలగించారు. పాత GOPS ఉన్నచోటులో ఇప్పుడు ఒక ఫుడ్ కోర్ట్ ఒకటి కొత్తగా ప్రారంభించారు. దీనికోసమే కొత్తగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టారు..(ఇక్కడ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.పాట పాడుకున్నారు కదా! రాబట్టుకోవాలి లెండి.) గోపాల్ కిరాణా షాపును కూడా ప్రస్తుతము నూతనముగా కట్టిన షాప్ కాంలోనే నడుపుతున్నారు.
రవి గారూ! మీరు అడిగిన చెట్టు అలానే ఉంది కానీ అప్పటి లుక్ పోయింది. అక్కడంతా ఫెన్సింగ్ వేసి చప్టా లాగా కట్టారు. so students కి ఇప్పుడు మిగిలిన gops ఒపెన్ ఆడిటోరియమే. ప్రస్తుతము అక్కడ నుండి కూడా సంగయ్య టీ షాపును తొలిగించడముతో విద్యార్ది మిత్రులంతా కలసి రెండు రోజులక్రితమే V.C దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది. vc, registrar అక్కడ ఒక టీ షాపు (OD వెనుక) open చేయడానికి అంగీకరించారట. కానీ ఆ షాపును నడపడానికీ సంగయ్యకి అవకాశమిచ్చే విషయంపై తరువాత నిర్ణయిస్తామని చెప్పారు. ఆ placeలో మళ్ళీ సంగయ్య , వెంకట్ ల షాపులు open చేయాలని మేము వారిని కోరడం జరిగింది.
ఇది చాలా ఘోరం. మూడేళ్ళు పాటు గోప్స్ (1999-2002)నామం అక్కడ గడిపిన సాయంత్రాలెన్నో.1999-2000 సంవత్సరంలో నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ వైస్‌ప్రెసిడెంట్ గా వుండగా అక్కడ చాలానే అభివృధ్ధి చేసాం. ఇప్పుడదంతా నేల మట్టమయిందంటే నమ్మలేకున్నాను. ఈ సారి హైదరాబాదు వస్తే ఇక హెచ్ సి యూ వెళ్ళాల్సిన అవసరం లేదేమో! పీకాక్ లేక్, మష్రూం రాక్ అయినా ఉన్నాయా?
venkat
www.24fps.co.in
Post a Comment