నీ గురించి ఆలోచిస్తుంటే ఇక ఈ రాత్రికి నిద్రే లేదు. వసంతాగమనమే కాదు కొత్త ఉషస్సులు కూడా నన్ను నిద్ర పోనివ్వటం లేదు. నడి రాతిరి ఉషస్సుల మెరుపులు ఏ హృదయ గానాల అవ్యక్త భావనలో ఇప్పుడిక తెలిసే అవకాశం మరి లేదు. తొడిమను విడిచిన ఆ లేతాకు ఇప్పుడు సమీరంతో చెలిమి చేసింది. నూతన మజిలీలు ఇప్పుడిక తరగని గమ్యాలుగా మారాయి. ఒక సంఢ్యా ప్రారంభకాలాన గమ్యమో మజిలీనో తెలియని ఒక చైతన్యపూరిత ప్రశాంత జాగ్రదావస్తలో ఆ నునులేత చిగురు చడీచప్పుడు చెయకుండా నేలను తాకుతుందేమో. వేచి చూడాలి మరి. సమీరంతో చెలిమి కొనసాగేనా ?
1 comment:
సమీరం, అధారరహిత ఆవరణముదే కాదు మిత్రమా... ఆ లేతాకు చేరు నేలది కూడాను... అది సారస్వతం...
Post a Comment