Sunday, 11 March 2007

ప్రపంచ కప్ వైబ్రేషన్స్

క్రికెట్ జ్వరం నెమ్మదిగా కాంపస్ ని కూడా చుట్టేస్తోంది. విద్యార్ధిలోకంలో ఇప్పటికే భారత్ హాట్ ఫేవరెట్ గా అవతరించింది.ఇంకా విజయావకాశాలు మెండుగా ఉన్న ఇతరజట్లను గురించికూడా వాడిగా, వేడిగా చర్చించుకుంటున్న విధ్యార్ధి బృందాలు కాంపస్ లో ప్రత్యక్షమవుతున్నాయి. సమరాంగణం సిద్దమైంది. వేచిచూసే కళ్ళకు నిద్ర కరువైంది. పెన్నులతోనూ, పరీక్షనాళికలతోనూ పడరాని పాట్లుపడే చేతివేళ్ళు ఇక ఉత్సాహంగా ఛానళ్ళు తిప్పటానికి ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే మొదలైన వార్మప్ మాచ్ లు వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.ఇహనుండీ రాత్రుళ్ళు కన్నుల పండుగలైతే పగలు కునికిపాట్లే మరి. ఏదేమైనప్పటికీ ఆల్ ది బెస్ట్ ఇండియా.