Thursday, 29 March 2007

కోపమునకు పెక్కు రూపములు.

కోపమునకు పెక్కు రూపములు.నానావిధములైన వ్యక్తీకరణలు.అవన్నీ కూడబలుక్కుని ఇప్పుడు సృజనాత్మకమైన ఈ-మెయిళ్ళుగా రూపుదాలుస్తున్నాయి. తత్ఫలితములే గత కొద్దిరోజులుగా కాంపస్ కమ్యునిటీలో మాటల మధ్యన దొర్లుతున్న పసందైన ఈ-మెయిల్స్ సంగతులు.తమ అభిమాన ఆటగాళ్ళు ఇప్పుదు ఉద్యోగాలు మారారు. సరికొత్త అవతారాలు దాల్చారు. తత్వం భోదిస్తోనో, పండ్లుఫలాలూ అమ్ముతూ, చాయ్ వాలాలుగానూ ఇప్పుడు మనతో ఈ-మెయిల్లలో దోస్తీ కడుతున్నారు.ఒక మెయిల్ ఇలా ఉంటే మరో దాంట్లో పాకిస్తానీలతో జతకట్టిన వైనం నవ్వుల పువ్వులు పూయించింది.ఇకా చాలా రకాలైన విమర్శలే నెట్లో విద్యుత్ విహారం గావిస్తున్నై. ఇప్పుడు చెప్పండి మరి వినోదానికి క్రీడల్లో నిజంగా గెలవాలా.....పోనిద్దురూ ఓడినా ఇన్ని సరద మెయిళ్ళకు ప్రేరకులుగా మన ముందుకువచ్చారు. హాట్సాఫ్ టు టీం ఇండియా.

No comments: