Sunday, 11 March 2007

"తీస్రీ ఆజాది" --(మరి కొంచెం కళాత్మకత కావాలి)

ఏ దృశ్యమాధ్యమానికైనా ప్రేక్షకునిలో చూడాలనే కోరిక కలిగించడం అనేది ప్రాధమిక లక్షణం. లేకుంటే అది ఉద్దేశ్యం బాగానే ఉన్నా ప్రెజంటేషన్ లోపించిన చిత్రం "తీస్రీ ఆజాది" లా తయారవుతుంది. ఈ చిత్రంలో పరిమిత వనరులతోకూడిన తారాగణమే కాదు, లోపించిన చిత్రీకరణ విలువలు కూడా ప్రేక్షకుడిని అసహనానికి గురి చేస్తాయి.విజేతలు రచించిన చరిత్ర పుటలలోని చీకటి కోణాలను ఆవిష్కరించడానికి జరిపిన ఈ ప్రయత్నం మరికొంత శ్రద్ద తీసుకుని ఉంటే ఫలవంతమైయ్యేది.

నా అభిప్రాయం ప్రకారం ఈ సినిమా చూడటం కన్నా సౌదా అరుణ రచించిన "అపూర్వ పురాణ కథలు" పుస్తక పఠనం ఈ భాద్యతను చక్కగా నెరవేరుస్తుంది.బహుజనుల చరిత్రని సెల్యులాయిడ్ పైకెక్కించడం కొరకు జరిగిన ఒక ప్రాథమిక ప్రయత్నంగా ఈ సినిమాని గుర్తించవచ్చు.

No comments: