Sunday, 18 March 2007

గెలిచినందుకు కాదు ఓడినందుకు

నిన్న అర్ధరాత్రి హఠాత్తుగా అరుపులూ,కేకలూ వినిపిస్తూంటే ఇండియా గెలిచేసిందేమోనని అనిల్ టి.వీ రూంలోకి పరిగెత్తుకెళ్ళాడట. కాని విషయం అదికాదు. పాకిస్తాన్ ఓడింది, అదీ ఐర్లాండ్ పైన. అదండీ అసలు సంగతి. మన వాళ్ళు గెలవలేకపోయినా పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోవడం మిత్రులకు కొంతలో కొంత ఆనందాన్ని ఇచ్చింది.ఏదేమైనా ఎంచక్కని శుభారంభాన్ని ఇస్తారని ఎదురు చూసిన వారికి నిరాశను అందిస్తూ మొదటి మ్యాచ్ ముగిసింది. సరే రానున్న సర్వజిత్ నామ సంవత్సరంలోనైనా మన వాళ్ళు సవ్యంగా ఆడి కప్పు తెస్తారని ఆశిద్దాం.

No comments: