Sunday, 11 March 2007

సంక్షిప్త సంగతులు

గత వారం సంగతులా ఓ... చాలానే ఉన్నై. కొంచమే ఉన్నదల్లా ఖాళీ సమయం మాత్రమే. సరే సం క్షిప్తంగా చెప్పుకోదగిన ఊసులేంటంటే గత ఆదివారంD.S.T లో జరిగిన ఫ్రీ సాఫ్ట్ వేర్ పై జాతీయ సెమినారు,నిన్న నూరేళ్ళ గోర్కీ "అమ్మ" పై ప్రజాసాహితీ వారి కార్యక్రమమూ....ఇంకా... ఊ... కెమిస్ట్రీ విభాగం వారి "కెం ఫెస్ట్",యస్. యన్ స్కూలు వారి "ఊరుభంగం" నాటక ప్రదర్శన,అర్దం కాని సిద్దాంత రాద్దంతాలకు బలైపోతున్న సామాన్యుడి మూగవేదనకు చిత్ర రూపం "ఇన్ ద నేం ఆఫ్ ద గాడ్" డాక్యుమెంటరీ ప్రదర్శన,జాతీయ బడ్జెట్ పై రామన్ ఆడిటోరియంలో చర్చ,ఇండో-అమెరికన్ న్యూక్లియర్ డీల్ గురించి సెమినార్ ...........అబ్బో ఇంకా చాలానే ఉన్నాయిలేండి. ఖాళీ దొరికితే(ఖాళీ లేదనటం వంక మాత్రమే.నిజానికి నాకు కీ బోర్డుపై టైపు చేయడం రాదు. అసలు సంగతి అదీ.ఇప్పుడిప్పుడే టైపింగు నేర్చుకుంటున్నాననుకోండీ). అన్నిటి గురించీ వివరంగా మరెప్పుడైనా.....

No comments: