Saturday, 28 June 2008

ఒక వర్షం - ఒక ఇరానీ ఛాయ్


తొలకరి వానలతో కాంపస్ కొత్త అందాలు సంతరించుకుంది. నిన్నటి వరకు ఎండ వేడికి కాగిపోయిన మట్టి,ఇప్పుడు చల్లని వర్షపు నీటిలో తడిసి వింత వాసనలు వెదజల్లుతుంది. ఇన్నాళ్ళూ ముదురు గోధుమ రంగులో కనిపించిన కాంపస్ ఇప్పుడు లేత హరిత వర్ణం లో కి మారుతోంది. జడి వానలో చిక్కుకుపోయిన చెట్లనీ,రోడ్లనీ roomలో నుంచి చూడటము భలే సరదాగా ఉంది. చిన్నప్పటి నుండీ చూసేదే అయినా ప్రతీ సారీ ఇదొక కొత్త అనుభవము. ప్రస్తుతము నా కోర్స్ అయిపొయింది కాబట్టి హఠాత్తుగ మబ్బులు పట్టి వర్షం లో తడిసి ముద్దయ్యే రోడ్ల మీద నింపాదిగా నడుచుకుంటూ వెళ్ళీ shop comలో ఒక ఇరానీ చాయ్ తాగి రావడములో ఉన్న ఆనందాన్ని Friendsతో కలసి enjoy చేస్తున్నాను.

Friday, 11 April 2008

సుకూన్ జ్ణాపకాలు కొన్ని...










ఇందులో మొదటి రెండు చిత్రాలు North-East Festival లోవి.

తరువాత DSTలో డాన్స్ కాంపిటీషన్
4వ చిత్రం సుకూన్ లోగో
5వది ఖవ్వాలీ
6వది సుకూన్ వేదిక Open Dias

ఇక చివరగా సుకూన్ అతిధి ఈ ఒంటె

Thursday, 10 April 2008

అలా జరిగిందన్నమాట !



సుకూన్ సందడి ముగిసాక మళ్ళీ రోజువారీ ఎకడమిక్స్ మొదలయ్యాయి. మళ్ళీ ల్యాబులు,క్లాసులు,పరీక్షలు....మరింతగా వేడెక్కిన వాతావరణం.ఇంకో 20 రోజులలో ఫైనల్ ఎక్జాంస్ ఉండటముతో మళ్ళీ ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. sukoon ఫొటోలు upload చేద్దామంటే అస్సలు Time చిక్కడములేదు. సరే నెమ్మదిగానే అన్ని fotos, vedeos అప్ లోడ్ చేస్తాను.
ఏదేమైన ఈ సారి సుకూన్ బాగానే జరిగింది.ఒంటెలు,గుర్రాలు ఎక్కి ఆ సరదా తీర్చుకున్నాము. ఇంకా జెయింట్ వీల్ కూడా ఎక్కాము.నాకైతే ఇదే మొదటి సారి జెయింట్ వీల్ ఎక్కడం. మొదట చాలా భయం వేసింది. మా సీనియర్ చంద్ర మౌళి సహాయముతో ఆ ముచ్చట తీర్చుకోగలిగాను. ఇంకా archestra కార్యక్రమాన్ని కూడా మేము DJ night గా మార్చేసాము.కిషొర్,ఈశ్వర్,కాటం,విద్య.....అందరూ చిందేసారు.
నేను మొదట సారిగా NOrth-East Festival చూసాను. ....అద్భుతం. చాలా బాగుంది. "మాగురించి మీరేమనుకుంటున్నారు?" అంటూ వారు విడుదల చేసిన చిన్ని పుస్తకం ఆకర్షణీయముగా ఉంది. వాళ్ళ గురించి మేమేమనుకుంటూన్నామన్నది వారికి స్పష్టముగా తెలుసన్నమాట. మీ సహనానికి జోహార్లు friends. "Really you are the cool guys."
ఇంకా చివరి రోజు IAS గోపాల క్రిష్ణ గారి ఉపన్యాసం చాలా ఉత్తేజభరితం గా ఉంది. మాకొచ్చిన ప్రైజులు ఆ హడావిడి అంతా మామూలే. Miss Sukoon. Nivedita ఆ అవార్డుకు వన్నెలద్దారు. ఆ పది నిముషాలలోనే ఆమె fansగా మారిన వారిని నేను చూసాను. భావాలలో స్పష్టత,పొందికైన మాటతీరు ఆమెని విజేతగా నిలిపాయి. ఇక మా Srikanth కి ఎప్పుడోకప్పుడు ఇలాంటి ప్రైజొకటి వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను. నా కళ్ళముందే సాధించాడు.All the best for his future.
ఆ రోజు రాత్రి మా DJ కాస్తా కొద్దిసేపటికే Rain Dance రూపం తీసుకుంది.కొంచెం సేపు "ఈ వర్షం సాక్షిగా...." అంటూ గెంతాము కానీ మా ఆటలు ఎక్కువ సేపు సాగలేదు. వర్షం పెద్దది అవ్వటంతో సుకూంకి వీడ్కోలు చెప్పి OD నుంచి తిరుగుముఖం పట్టాము. అదే రాత్రి నేను, మా భాను,అజయ్,రమేష్... ect కలిసి వర్షంలో తడుచుకుంటూ ఒక Ice CReam లాగించేసాం....ఒక మర్చిపోలేని వింత అనుభవమది.
తెల్లారక ఉగాదికూడా బాగానే celebrate చేసుకున్నాము. Evening DSTలో దిట్టంగానే తిన్న ఉగాది పచ్చడి, బొబ్బట్లు,పులిహోరలతో పాటుగా ఆచార్య బేతవోలు రాంబ్రహ్మం గారి ఉపన్యాసమును కూడా చక్కగా ఆస్వాదించాము.
ఇక enjoymentకు తాత్కాలికం గా విరామము. ప్రస్తుతానికి మళ్ళీ చదువుసంధ్యలు? career గురించిన గట్టి ప్రయత్నాలు,applications,entrance exams................... ఇలాసాగుతుంది ప్రస్తుతం life. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో టపాలో కలుద్దాం...bye

Tuesday, 1 April 2008


కొన్ని సార్లు మౌనం చాలా బాగుంటుంది. నిశ్శబ్దం మాట్లాడుతుంది. ప్రశాంతతకు దగ్గరి దారి నేను నిశ్శబ్దమని నమ్ముతాను.సహజంగా నేను ప్రతి క్షణాన్నీ ప్లాన్ చేయాలనుకుంటాను కానీ ఇప్పుడిప్పుడే అర్దమౌతున్నదేమంటే .....అది అంత ఉపయోగకరము కాదని!
పనిచేస్తూ,ఆలొచిస్తూ,tv చూస్తూ,,,..... ఏదొ ఒకటి చేస్తూ.....ఉహు ఈ life బాగాలేదు. కొంచెం మౌనం...కొంచెం ఖాళీ కావాలనిపిస్తుంది. Just ఖాళీ అంతకుమించి మరేదీ లేదు. కేవలం ఖాళీ,శూన్యం అంతే. చప్పుడు చేయకుండా సాగిపొయే buffello lake అలలాగా,నిశ్శబ్దంగా గడిచిపొయే కాలగమనములాగా.......అడుగులో అడుగు వెసుకుంటూ మందగమనముతో మృదువుగా సాగిపోవలనిపిస్తూంది.భూమి గుండ్రముగా ఉంది .....సో ఎక్కువ వేగముగా పరిగెత్తడమేమీ అంత తెలివైన పని కాదు. అదీ అసలు సంగతి...."ఈ స్టేషన్లో కొంచెం చాయ్ తాగి నెక్ష్ట్ పాసింజెర్‌కి వెళదాం.....పోయేదేమీ లేదు.

Monday, 1 October 2007

ఆర్కుట్ / ఓర్కుట్ ??!!


తెలుగు ఆర్కుట్ (ఓర్కుట్ అయివుండవచ్చు...) చూశాను.ప్రయత్నం బాగానే ఉంది కానీ పరిణితి లోపించింది.కొన్ని సందర్భాలలో అమెరికన్ సంస్కృతికి తెలుగు మాటలు దొరకక (అతకక) ఇబ్బంది పడ్డారని అర్ధమవుతూనే ఉంది (relationship మొదలైన అంశాలలో).అలాగే పిల్లలు అన్న కాలంలో సమాధానం "లేరు" అని పేర్కొనటానికి బదులుగా "లేదు" అని ఇచ్చారు ఇటువంటి చోట్ల సవరణలు చేయాల్సి ఉంది. కానీ ప్రయత్నిస్తే ఆర్కుట్‌ను తెలుగులో మరింత అందముగా అందించవచ్చు.
మరీ ముఖ్యంగా ఆర్కుట్ గురించి ఇచ్చిన వివరణను చదవడానికి నాకు చాలా సమయం పట్టింది. రాసింది తెలుగులోనే అయినా తెలుగుతనం లోపించింది.వాక్య నిర్మాణ పరంగా ఇంకొంచెం కృషి చేస్తే తెలుగు ఆర్కుట్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.Google అనువాద ప్రయత్నాలు ఒక కొలిక్కివస్తే ఆర్కుట్‌ను పూర్తిగా తెలుగులో ఆనందించవచ్చునేమో. ప్రథమ ప్రయత్నం కాబట్టి అభినందించవచ్చు.

మన ఉనికి సంగతేమిటి మహా ప్రభో!


రామ సేతు లేదా ఆడంస్ బ్రిడ్జిగా పేర్కొంటున్న ఇండో-శ్రీ లంక నిర్మాణంపై రాజకీయ దృష్టికోణంలో జరుగుతున్న చర్చలను పక్కన పెడితే పర్యావరణ పరంగా ఆ నిర్మాణం వలన ఉపఖండానికి జరుగున్న మేలు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. మానవ వైజ్ఞానిక శక్తులు ఎంతముందుకి పురోగమించినా నేటికీ అంతుబట్టని ప్రాకృతిక రహస్యాలు అనేకం ఇప్పటికీ చిక్కుముడులుగానే మిగిలిపోయాయి. ఈ నేపధ్యంలో పాక్ జలసంధిలోని సముద్ర స్థితిగతులపైనా, అక్కడి భూభౌతిక పరిస్థితులపైన సమగ్రమైన అవగాహన లేకుండా తొందర పాటు చర్యలకు పూనుకోవడం తెలివిమాలిన పని. ఇది తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడంలాంటిది.ఇటీవలి సునామీ తీవ్రతను తగ్గించడంలోనూ,సముద్ర జీవావరణాన్ని సంతులన పరచడములోనూ రామ సేతు నిర్వహిస్తున్న పాత్ర కీలకమైనదన్న వాదనను తీసిపారేయకుండా ఈ కోణంలో తగిన పరిశోధన గావించడం అత్యావశ్యకం. లేకుంటే అటుపిమ్మట జరిగే మహ విపత్తులకు మానవాళి భారీ మూల్యం చెల్లించవలసిరావచ్చు.
ఇది కాకుండా గ్రాండ్ కెన్యాన్,మాజిక్ రాక్ వంటి భౌగోళిక అద్భుతాలను పరిరక్షించు కోవడానికి ప్రపంచంలో ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మనము మాత్రం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇక్కడి ప్రకృతి సిద్ద రూపాలకు మంగళం పాడుతున్నాము. ఇది ఆలోచించవలసిన సంగతి.

Gods Must be Crazy

Gods must be crazy సినిమా చూస్తున్నంత సేపూ నవ్వీ,నవ్వీ మాకు బుగ్గలు నొప్పెట్టాయి. ఈ సినిమా గురించి ఇంతకు ముందొకసారి ఆంధ్రజ్యొతిలో చదివానుకానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు. అయితే ఆహ్లాదకరమైన ఈ హాస్యం వెనుక మనసును చివుక్కుమనిపించే జీవన వాస్తవికతలు కూడా తగులుతాయి. కోలా బటిల్ రూపంలో ఆఫ్రికాలోని బుష్ మెన్‌ల మధ్యకు అడుగిడిన నాగరికతా వాసనలు ఆ స్వచ్చమైన అడవిబిడ్డల జీవితాలలో కలిగించిన అలజడినీ, ఆ వినాశనకరమైన Gods Giftను వదిలించుకోవడానికి "క్సి" ఎదుర్కొన్న సమస్యలను ఈందులో చిత్రించిన విధానం ప్రేక్షకులకు మరోసారి సినిమా చూడాలనిపించేటట్లు చేస్తుంది.మరీ ముఖ్యంగా Marius Weyers తన జీప్‌తో సృష్టించిన కామెడీ బాగుంది.


ఈ సినిమా మీద వాద వివాదాలెలా ఉన్నప్పటికీ చూడటానికి రికమెండ్ చేయదగిన సినిమా. దీనికి తరువాత రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి. అవి నేను చూడలేదనుకోండి. ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం చాలా బాగుంది.


Monday, 27 August 2007

"................".........జై హింద్ !

శనివారం సాయంత్రం హైదరాబాదు నగర నడి బొడ్డున చోటుచేసుకున్న దారుణాన్ని విశ్వవిద్యాలయంలోని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భముగా ఈరోజు సాయంత్రం 7 గం. లకు "Peace Walk" నిర్వహించడం జరిగింది. DST ఆడిటోరియం నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన birth day circle మీదుగా Shop com వరకు జరిగింది. ఈ సందర్భముగా ప్రసంగించిన వక్తలు ఈ దాడి ఏ ఒక్క మతస్తులపైనో జరిగిన దాడి కాదని యావత్ భారతీయులపై జరిగిన దాడి అనీ పేర్కొన్నారు. నిన్న మసీదులో, నేడు విహార స్థలాల వద్ద జరిపిన ఈ దాడులు గర్హనీయమైనవని పేర్కొన్నారు. భావజాలాలకు అతీతముగా భారతీయులందరూ ఇటువంటి విచ్చిన్నకర శక్తుల చర్యలను ఖండించాల్సిందిగా విజ్ణప్తి చేశారు.
కొవ్వొత్తులు వెలుగులో సాగిన ఈ మౌన ప్రదర్శనలో university విద్యార్ధులు విశేషంగా పాల్గొని దుర్ఘటన భాదితులకు తమ సానుభూతి, సంఘీభావం తెలిపారు. Shop Com వద్ద వెలుగుతున్న కొవ్వొత్తులు కన్నీటి బిందువు ఆకారంలో వెలుగులు విరజిమ్ముతూ అక్కడ సమావేశమైన వారి బరువెక్కిన హృదయాల భావాలను చెప్పకనే చెప్పాయి. వెలుగుతున్న ఆ దీపాలు మానవత్వం పట్ల ఈ నగర వాసులకు ఉన్నా గట్టి నమ్మకానికీ, విచ్చిన్నకర శక్తుల పన్నాగాలకు తల ఒగ్గని మనో స్థైర్యానికీ ప్రతీకలుగా ప్రకాశించాయి.
ఈ కార్యక్రమ నిర్వహణలో intigrated course విద్యార్ధులు చూపిన చొరవ ప్రత్యేకముగా పేర్కొనదగినది. దుర్ఘటన వివరాలు అందిన వెంటనే వారు స్పందించి ఆదివారం ఉదయమే బాధితులకు అవసరమైన ఆహార పదార్ధాలూ, cell phone recharge coupanలు తీసుకుని Medicity Hospitalలోని బాధితులకు అందజేశారు. వారి చొరవ ప్రశంసనీయం. కనీసం ఆహార పదార్ధాలను కూడా స్వీకరించలేని స్థితిలో ఉన్న బాధితుల గురించి వారు చెప్పిన సంగతులు ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని కదిలించివేశాయి. ఇటువంటి దుర్ఘటనలు మరలా జరగకుండా తీసుకోవలసిన చర్యల గురించి చర్చిస్తూ బాధాతప్త హృదయాలతో మేమక్కడ నుండి తిరిగి వచ్చాము.