తెలుగు ఆర్కుట్ (ఓర్కుట్ అయివుండవచ్చు...) చూశాను.ప్రయత్నం బాగానే ఉంది కానీ పరిణితి లోపించింది.కొన్ని సందర్భాలలో అమెరికన్ సంస్కృతికి తెలుగు మాటలు దొరకక (అతకక) ఇబ్బంది పడ్డారని అర్ధమవుతూనే ఉంది (relationship మొదలైన అంశాలలో).అలాగే పిల్లలు అన్న కాలంలో సమాధానం "లేరు" అని పేర్కొనటానికి బదులుగా "లేదు" అని ఇచ్చారు ఇటువంటి చోట్ల సవరణలు చేయాల్సి ఉంది. కానీ ప్రయత్నిస్తే ఆర్కుట్‌ను తెలుగులో మరింత అందముగా అందించవచ్చు.
మరీ ముఖ్యంగా ఆర్కుట్ గురించి ఇచ్చిన వివరణను చదవడానికి నాకు చాలా సమయం పట్టింది. రాసింది తెలుగులోనే అయినా తెలుగుతనం లోపించింది.వాక్య నిర్మాణ పరంగా ఇంకొంచెం కృషి చేస్తే తెలుగు ఆర్కుట్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.Google అనువాద ప్రయత్నాలు ఒక కొలిక్కివస్తే ఆర్కుట్‌ను పూర్తిగా తెలుగులో ఆనందించవచ్చునేమో. ప్రథమ ప్రయత్నం కాబట్టి అభినందించవచ్చు.

1 comment:
ఇది తలా ఓ చెయ్యి వేసి చేసిన కార్యం. చెయ్యి వేసిన వారిలో ఎక్కువ మందికి భాష మీద ప్రేమ ఎక్కువ భాష మీద పట్టు తక్కువ. ఇప్పటికైనా గూగుల్ వాదు నాలుగు రాళ్ళు కేటాయించి నలుగురు కూలీలను పెట్టి పని చేస్తే బాగుపడుతుంది. ఇలా ఉచిత ప్రేమికులపై ఆధారపడటం తగ్గిచ్చి :)
Post a Comment