Gods must be crazy సినిమా చూస్తున్నంత సేపూ నవ్వీ,నవ్వీ మాకు బుగ్గలు నొప్పెట్టాయి. ఈ సినిమా గురించి ఇంతకు ముందొకసారి ఆంధ్రజ్యొతిలో చదివానుకానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు. అయితే ఆహ్లాదకరమైన ఈ హాస్యం వెనుక మనసును చివుక్కుమనిపించే జీవన వాస్తవికతలు కూడా తగులుతాయి. కోలా బటిల్ రూపంలో ఆఫ్రికాలోని బుష్ మెన్‌ల మధ్యకు అడుగిడిన నాగరికతా వాసనలు ఆ స్వచ్చమైన అడవిబిడ్డల జీవితాలలో కలిగించిన అలజడినీ, ఆ వినాశనకరమైన Gods Giftను వదిలించుకోవడానికి "క్సి" ఎదుర్కొన్న సమస్యలను ఈందులో చిత్రించిన విధానం ప్రేక్షకులకు మరోసారి సినిమా చూడాలనిపించేటట్లు చేస్తుంది.మరీ ముఖ్యంగా Marius Weyers తన జీప్‌తో సృష్టించిన కామెడీ బాగుంది.ఈ సినిమా మీద వాద వివాదాలెలా ఉన్నప్పటికీ చూడటానికి రికమెండ్ చేయదగిన సినిమా. దీనికి తరువాత రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి. అవి నేను చూడలేదనుకోండి. ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం చాలా బాగుంది.

1 comment:
అవువు, మొదటి భాగం చాలా చాలా బావుంటుంది. చూసి చాలా ఏళ్ళే అయ్యింది. గుర్తు చేసినందుకు నెనర్లు, ఇక్కడి లైబ్రరీలో ఉందేమో వెతికి చూస్తాను..
Post a Comment