
కొన్ని సార్లు మౌనం చాలా బాగుంటుంది. నిశ్శబ్దం మాట్లాడుతుంది. ప్రశాంతతకు దగ్గరి దారి నేను నిశ్శబ్దమని నమ్ముతాను.సహజంగా నేను ప్రతి క్షణాన్నీ ప్లాన్ చేయాలనుకుంటాను కానీ ఇప్పుడిప్పుడే అర్దమౌతున్నదేమంటే .....అది అంత ఉపయోగకరము కాదని!
పనిచేస్తూ,ఆలొచిస్తూ,tv చూస్తూ,,,..... ఏదొ ఒకటి చేస్తూ.....ఉహు ఈ life బాగాలేదు. కొంచెం మౌనం...కొంచెం ఖాళీ కావాలనిపిస్తుంది. Just ఖాళీ అంతకుమించి మరేదీ లేదు. కేవలం ఖాళీ,శూన్యం అంతే. చప్పుడు చేయకుండా సాగిపొయే buffello lake అలలాగా,నిశ్శబ్దంగా గడిచిపొయే కాలగమనములాగా.......అడుగులో అడుగు వెసుకుంటూ మందగమనముతో మృదువుగా సాగిపోవలనిపిస్తూంది.భూమి గుండ్రముగా ఉంది .....సో ఎక్కువ వేగముగా పరిగెత్తడమేమీ అంత తెలివైన పని కాదు. అదీ అసలు సంగతి...."ఈ స్టేషన్లో కొంచెం చాయ్ తాగి నెక్ష్ట్ పాసింజెర్‌కి వెళదాం.....పోయేదేమీ లేదు.
No comments:
Post a Comment