Friday, 1 June 2007

THE PLACE TO BE..........

భూమిక మే 2007 సంచికలో "శభాష్ ఫరా అజీజ్" చదివిన తరువాత ఇది రాయాలనిపించింది. ఆ కథనం తాలూకూ లింకు క్రింద ఇస్తున్నాను.
http://bhumika.org/2007/05/shabhash_farah_azeez/
అలీఘడ్ యూనివర్శిటీలో ఫరా అజీజ్‌కు ఎదురైన చేదు అనుభవాలనూ, చదువుకుంటున్న పోకిరి వెధవల ఆగడాలను ధైర్యంగా ఎదుర్కున్న తీరునూ ఈ వ్యాసం లో వివరించారు.

ఈ సందర్భంలో మా యూనివర్సిటీ వాతావరణం గురించి చెప్పాలనిపించింది. మా యూనివర్శిటీ గురించి బయటనున్న మా స్నేహితులకు మేము గొప్పగా చెప్పుకునే అంశాలలో ఇది కూడా ఒకటి...మాది "జెండర్ ఫ్రెండ్లీ క్యాంపస్" అన్న సంగతి.రెండేళ్ళ క్రితం నేను అనిల్ కోసం ఈ కాంపస్ కి వచ్చినప్పుడు అర్ధరాత్రులు కూడా లైబ్రరీలలో,C.C లో,కాంపుస్‌లోని పొడవాటి రోడ్లపైనా ఆడపిల్లలు ఒంటరిగా తిరుగుతూండటమనేది ఇక్కడ సర్వసాధారణం అని చెపితే నేను నిజంగా నమ్మలేదు.ఎందుకంటే H.C.U ఏమీ సిటీ మధ్యలో ఉన్నా కాంపస్ కాదు. నగరంలోని విద్యాలయాలలో, రోడ్లపైనా,సిటీ బస్సులలోనూ పగటిపూటే అమ్మాయిలు ఎదుర్కునే చేదు అనుభవాలు చూస్తూ కూడా సంధ్యవారగానే నెమళ్ళు, అడవిపందులూ,అరుదైన పక్షిజాతులూ స్వేచ్చగా రోడ్లపైకి వచ్చి సంచరిచేపాటి జనసమ్మర్ధం గల ప్రాంతం అయిన H.C.U గురించి ఇలాంటి సంగతులు చెప్తే ఎవరు మాత్రం నమ్ముతారు చెప్పండి. ఈ యూనివర్సిటీ నగరానికి సుమారు 15కి.మీ దూరంలో ఉంటుంది మరి.

ఇటువంటి ప్రాంతానికి హఠాత్తుగా నగరంనుండి ఊడిపడినవాళ్ళు ఇలాంటి విషయాలు అంత తొందరగా నమ్మలేరు.అందుకని నేను ఆ రాత్రి కాంపస్‌లోనే ఉండి ఈ సంగతి నిజమేనని నిర్ధారించుకున్నాను. మొన్నామధ్యన నాకోసం వచ్చిన మా స్నేహితుడు శ్రీ పతికి ఇప్పటికీ ఈ విషయంలో అనుమానమే.అతను ఆ రోజు రాత్రి మా కాంపస్ లో ఉండలేదుమరి!!! , అందుకే వాడికి ఇంకా నమ్మకం కుదరలేదు.

ఈ విషయంలో anti-sexual harrassment commity కి చెప్పుకోదగ్గ పాత్ర ఉంది. అలాగే మా Prof.ADG మాడం గారు విద్యార్ధుల సంక్షేమం పట్ల చూపించే శ్రద్ద మరొక కారణమని చాలా మంది అభిప్రాయం. సరే ఏదేమైతేనేం మేము గర్వంగా చెప్పుకుంటాం ....................

మాది "జెండర్ ఫ్రెండ్లీ కాంపస్".

UNIVERSITY OF HYDERABAD.....the place to be

No comments: